నకిలీ వెబ్‌సైట్‌లతో చీటింగ్‌... 12 మంది అరెస్టు

Delhi Police Arrested Twelve People Cheating With Fake Websites - Sakshi

న్యూఢిల్లీ: నకిలీ వెబ్‌సైట్‌లతో మోసాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు నాలుగు వేర్వేరు ఆపరేషన్‌లు నిర్వహించి సుమారు 12 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. తమ కంపెనీ పేరుతో కొందురు వ్యక్తులు నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి ఈమెయిల్‌ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారంటూ పలు కంపెనీలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దీంతో సదరు కంపెనీల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ప్రారంభంలో సుమారు ఏడుగురుని అదుపులోకి తీసకున్నట్లు వెల్లడించారు. నిందితులు షమ్మీ, ఆలం ఖాన్‌, అతుల్‌ దీక్షిత్‌, ప్రేమ్‌ దత్‌, ఢిల్లీ నివాసితులు, సర్దార్‌ అమిత్‌ సింగ్‌, మోను కుమార్‌, సందీప్‌ చౌదరి, గోపాల్‌ కుమార్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రశాంత్‌ గౌతమ్‌ తెలిపారు. నిందితులందరూ  బిహార్‌లు నివాసితులని చెప్పారు.

తదుపరి ఆపరేషన్‌లో మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో సదరు నిందితులు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి, ఈమెయిల్‌ ఐడీలు క్రియోట్‌ చేసుకుని క్లయింట్‌లకు మెసేజ్‌లు, కాల్‌లు చేయడం వంటివి చేసి వారితో లావాదేవీలు జరిపినట్లు తేలింది. అంతేగాదు కంపెనీ మార్కుతో కూడిన ఆమోద లేఖలను సైతం బాధితులకు పంపి మోసగించినట్లు వెల్లడించారు. దీంతో పలువురు బాధితులు ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయినట్లు పోలీసులు చెప్పారు.

(చదవండి: సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్‌ పట్టుకుని...)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top