'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితా­న్ని చాలిస్తున్నా' | Degree Student Commits Suicide in Miyapur Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: 'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితా­న్ని చాలిస్తున్నా'

Oct 19 2022 3:39 AM | Updated on Oct 19 2022 6:11 AM

Degree Student Commits Suicide in Miyapur Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(మియాపూర్‌): డిగ్రీ విద్యార్థిని 20 అంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్ప­డింది. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ యాదగిరి రావు అందించిన వివరాలివి. పటాన్‌చెరులోని ఏపీఆర్‌ ఫామ్స్‌లో నివసిస్తున్న మణినాథ్, సౌందర్యల కూతురు కోమలిక (21) నిజాం కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లోని ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఫౌంటెన్‌ హెడ్‌ అపార్ట్‌మెంట్‌లోని అమ్మమ్మ, తాతయ్య ఫ్లాట్‌లో 6 నెలలుగా ఉంటోంది.

ఈ క్రమంలో కోమలిక కళాశాల నుంచి మంగళవారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి అపార్ట్‌మెంట్‌ 20వ అంతస్తు పైకి వెళ్లి ఒక్కసారిగా కిందకు దూకింది. తల, శరీర భాగాలకు తీవ్ర రక్తపు గాయాలు కావడంతో అక్కడిక­క్కడే మరణించింది. డైరీలో ‘నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. నా జీవితా­న్ని చాలించుకుంటున్నా’ అని ఇంగ్లిష్‌లో రాసి పెట్టిందని పోలీసులు తెలిపా­రు.­ కోమలిక ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నామని పేర్కొ­న్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement