మణికొండలో కలకలం.. కారులో మృతదేహం | Sakshi
Sakshi News home page

మణికొండలో కలకలం.. కారులో మృతదేహం

Published Sun, Feb 4 2024 1:21 PM

Dead Body In Car In Manikonda Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మణికొండలో కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్‌లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కారు డ్రైవర్ సీటు వెనుక లో మృతదేహం లభ్యం కావడంతో హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కారు నంబర్‌ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement