ఈ కొరియర్‌ బాయ్‌ మామూలోడు కాదు!

Courier Boy Arrested For Thefting Jewelry In Mumbai - Sakshi

ముంబై : ఓ కొరియర్‌ బాయ్‌ దొంగబుద్ధి అతడి కొంపముంచింది. నగల పార్శిల్‌తో పరారైన అతడు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ సంఘటనలో ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన పరాస్‌ భన్సాలీ(53) అనే వ్యాపారవేత్త కొద్దిరోజుల క్రితం నగలను వేరే చోటుకు పంపటానికి ఆన్‌లైన్‌ కొరియర్‌ యాప్‌ను ఎంచుకున్నాడు. కొరియర్‌ బాయ్‌ రఫికీ సయా(36) ఆ పార్శిల్‌ను తీసుకుపోవటానికి ఆయన ఇంటికి వచ్చాడు. పార్శిల్‌ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అందులో ఖరీదైన వస్తువులు ఉన్నాయని భావించిన రఫికీ దొంగతనానికి ప్లాన్‌ చేశాడు. ( ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌‌ కేసు: మరో ముగ్గురి అరెస్ట్‌)

అనంతరం పార్శిల్‌ను డెలివరీ చేయకుండా ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ దాన్ని ఓపెన్‌ చేసి చూడగా బంగారు పోత పోసిన వెండి వస్తువులు కనిపించాయి. అయితే డిసెంబర్‌ 10న డెలివరీ అవ్వాల్సిన పార్శిల్‌ 18వ తేదీ వచ్చినా అవ్వలేదు. దీంతో పరాస్‌ భన్సాలీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రఫికీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి 1,43,000 రూపాయల విలువైన నగలను స్వాధీనం చేసుకుని, బాధితుడికి అప్పజెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top