HYD: భారీగా డ్రగ్స్‌ సీజ్‌.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్‌! | Cocaine Drug Seized In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: భారీగా డ్రగ్స్‌ సీజ్‌.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్‌!

Feb 26 2024 8:27 AM | Updated on Feb 26 2024 12:23 PM

Cocaine Drug Seized In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడితో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు పోలీసులు. కాగా, ఓ బీజేపీ నేత కుమారుడు నిన్న రాత్రి కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో విందులో కొకైన్‌ తీసుకున్నట్టు గుర్తించారు. ఇక, హోటల్‌లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement