షటిల్‌ ఆడుతూ సీఐ ఆకస్మిక మృతి‌

CI Deceased In West Godavari Over Heart Attack While Playing Shuttle - Sakshi

సాక్షి, గణపవరం: గణపవరం సీఐ డేగల భగవాన్‌ ప్రసాద్‌(42) గుండెపోటుతో మరణించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన స్నేహితులతో కలసి షటిల్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వాసుబాబు సోదరుడు కార్తీక్‌ వెంటనే ఆయనను అంబులెన్స్‌లో గణపవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి పీహెచ్‌సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు.

ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తూర్పుగోదావరి కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన భగవాన్‌ప్రసాద్‌ 2003లో కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి, 2007లో ఆర్‌ఎస్‌ఐగా, 2009లో  సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల క్రితం సీఐగా ప్రమోషన్‌ పొందారు. సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు.  

చదవండి: ప్రధాని హత్యకు కుట్ర: 14 మందికి మరణ శిక్ష 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top