వెయ్యి కోట్ల గోల్డ్ స్కాం : మరోసారి సోదాలు | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల గోల్డ్ స్కాం : మరోసారి సోదాలు

Published Wed, Feb 3 2021 12:59 PM

Chennai Ruby Gold Jewellers loan scamIbrahim arrest - Sakshi

సాక్షి, చెన్నై: వేల కోట్ల రూపాయలకు ఖాతాదారులకు కుచ్చు టోపీ పెట్టిన చెన్నై రూబీ జువెల్లరీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా  మరోసారి భారీఎత్తున తనిఖీలు చేపట్టారు. చెన్నై క్రైమ్ బ్రాంచ్ బృందం బుధవారం మరోసారి అమీన్ పూర్‌లో షెల్టర్ తీసుకున్న ఇంట్లో సోదాలు నిర్వహించింది.

2019 నుంచి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యల్లో హైదరాబాద్‌ అమీన్ పూర్ పోలీస్టేషన్ పరిధి భెల్‌ మెట్రో కాలనీలో ఇంట్లో నిందితుడు, పరారీలో ఉన్న జ్యువెలర్స్‌ యజమాని సయ్యద్ ఇబ్రహీంకు పోలీసులు చెక్‌ పెట్టారు. ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు.. మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

 కాగా  వెయ్యి కిలోలకు పైగా ఖాతాదారులకు బంగారాన్ని మింగేసిన చెన్నైలో రూబీ గోల్డ్ జ్యువెలర్స్‌ యజమాని సయ్యద్ ఇబ్రహీం మోసం  2019, మేలో వెలుగులోకి వచ్చింది. వడ్డీ లేని రుణాలకు బదులుగా తాకట్టు పెట్టిన బంగారంపై వడ్డీ లేని రుణాలిస్తానంటూ ఇబ్రహీం నమ‍్మబలికాడు. బంగారు విలువలో మూడింట ఒక వంతు రుణాలు ఇస్తానని పేర్కొన్నాడు. అయితే డబ్బును తిరిగి ఇచ్చిన తర్వాత కూడా ఇబ్రహీం ఎంతకీ బంగారం ఇవ్వకపోవడంతో 1500 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది.  గత మూడేళ్లలో 3 వేల మందికి పైగా రూ. 300 కోట్లకు పైగా విలువైన 1,000 కిలోల బంగారాన్ని నిందితులు సేకరించినట్లు అంచనా.  

Advertisement
Advertisement