చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు అరెస్ట్‌

Chandra Dandu Prakash Naidu Arrest And Moved to Remand - Sakshi

సాక్షి, అనంతపురం: మహిళలపై దౌర్జన్యం చేసిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. పుట్లూరు మండలం ఏ.కొండాపురం లో సోమశేఖర్ నాయుడుపై ఇటీవల హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రకాష్‌ నాయుడు, అతని సోదరులపై బాధితులు ఫిర్యాదు చేశారు.

దీంతో తనపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ప్రకాశ్‌ నాయుడు మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పుట్లూరు పోలీసులు టీడీపీ నేత ప్రకాష్ నాయుడుపై హత్యాయత్నం, దౌర్జన్యం కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: (టీడీపీ నేత ప్రకాశ్‌ నాయుడు దౌర్జన్యం..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top