టీడీపీ నేత ప్రకాశ్‌ నాయుడు దౌర్జన్యం.. మహిళను పబ్లిగ్గా బూతులు తిడుతూ

Anantapur TDP Prakash Naidu Threatens Woman And Scold Video Viral - Sakshi

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికి.. పచ్చ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదు. తాజాగా టీడీపీ నేత ఒకరు మహిళపై బెదిరింపులకు దిగారు. ఆ వివరాలు.. చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మహిళపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వీడియో ఒకటి శనివారం వెలుగులోకి వచ్చింది. 
(చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్‌)

అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల సోమశేఖర్ నాయుడును కారుతో గుద్ది చంపేందుకు యత్నించారంటూ ప్రకాశ్‌ నాయుడి సోదరులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలో ప్రకాశ్‌ నాయుడు బాధితుల ఇంటికెళ్లి బెదిరించాడు. తనపైనే కేసు పెడతారా అంటూ ప్రకాశ్‌ నాయుడు ఓ మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి పబ్లిగ్గా బూతులు తిట్టాడు ప్రకాశ్‌ నాయుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది. 

చదవండి: ‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top