థియేటర్‌ ధ్వంసం..  పవన్‌ అభిమానులపై కేసు  | Case Registered Against Pawan Fans Who Destroyed Theater | Sakshi
Sakshi News home page

థియేటర్‌ ధ్వంసం..  పవన్‌ అభిమానులపై కేసు 

Jul 2 2023 8:12 AM | Updated on Jul 2 2023 8:16 AM

Case Registered Against Pawan Fans Who Destroyed Theater - Sakshi

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్‌ను ధ్వంసం చేసిన పవన్‌ కళ్యాణ్‌ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్‌ కళ్యాణ్‌ నటించిన తొలిప్రేమ సినిమా శుక్రవారం నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్‌లో ప్రదర్శించారు. 

సెకండ్‌ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్‌ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయతి్నంచగా, థియేటర్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్‌ అభిమానులు రెచి్చపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్‌ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్‌లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారని థియేటర్‌ మేనేజర్‌ బి.మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు  శనివారం కేసు నమోదు చేసి ఏడుగురిని  అదుపులోకి తీసుకున్నారు. విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి: చనిపోయినట్లు భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement