యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటన.. స్పందించిన డాక్టర్లు.. | Boy Brutal Attack On Girl Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ యువతి డిశ్చార్జ్‌ 

Nov 19 2021 10:45 AM | Updated on Nov 19 2021 10:45 AM

Boy Brutal Attack On Girl Incident In Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్లు, చిత్రంలో... బాధిత యువతి  

సాక్షి, హస్తినాపురం(హైదరాబాద్‌): ప్రేమోన్మాది బస్వరాజు దాడిలో గాయపడిన యువతి పూర్తిగా కోలుకోవడంతో హస్తినాపురంలోని నవీన ఆసుపత్రి వైద్యులు గురువారం డిశ్చార్జ్‌ చేశారు. ఆసుపత్రి చైర్మన్‌ సుభాన్‌రెడ్డి, ఎండీ రాజవర్ధన్‌రెడ్డి, రఘుపతిరెడ్డి వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చేరినప్పుడు యువతి పొట్ట భాగంలో 18 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నారు.

అయితే, తమ ఆసుపత్రి వైద్య బృందం రణధీర్‌రెడ్డి, రవితేజ, మంజునాథ్, శ్రీను నాయక్‌లు గాయపడ్డ యువతిని ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్య చికిత్స అందించారన్నారు. యువతి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నా కూడా ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే బాధితురాలు పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా వైద్యం అందించామని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement