తమ బంధానికి అడ్డుగా ఉండని కొడుకును కాటికి పంపిన తండ్రి

Bihar: Father In Law Relation With Daughter In Law Son Life End - Sakshi

పాట్నా: కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు మరచిపోతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై సొంత కుటుంబసభ్యులనే కడతేరుస్తున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ తండ్రి తన సొంత కుమారుడి భార్యపై కన్నేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడుఅయితే. కోడలితో లైంగిక జీవితానికి అడ్డుగా ఉన్నాడని భావించి కుమారుడినే దారుణంగా హత్య చేసిన సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. చేసిదంతా చేసి మళ్లీ ఏమీ ఎరగనట్లు తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

బిహార్‌ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్‌ రవిదాస్‌ కుమారుడు సచిన్‌. ఇటీవల కొన్నేళ్ల కిందట కుమారుడికి వివాహమైంది. భర్త, మామతో కలిసి ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో మామ ఆమెపై కన్నేశాడు. మెల్లగా ఆమెకు దగ్గరై వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలా మామ, కోడలు కొన్నాళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులకు కుమారుడికి తన ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఒకసారి తన భార్యకు చేరువగా ఉండడాన్ని గమనించి తండ్రిని నిలదీశాడు. తన భార్యతో తండ్రి సాగిస్తున్న సంబంధం తెలుసుకుని హతాశయుడయ్యాడు. దీనిపై కుటుంబంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో కోడలితో సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి కొడుకు హత్యకు ప్రణాళిక రచించాడు. 

కొడుకు సచిన్‌తో జూలై 7వ తేదీన గొడవపడిన తండ్రి మిథిలేశ్‌ రవిదాస్‌ కొద్దిసేపటికి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి సంఘటనను తప్పుదోవ పట్టించాడు. కొంతమందిపై అనుమానం ఉందని ఓ ఐదుగురి పేర్లు కూడా చెప్పారు. వారిని విచారణ చేస్తుండగానే తండ్రి చేసిన ఘాతుకం బహిర్గతమైంది. నిందితుడు మిథిలేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top