అనుమానాస్పదంగా పసికందు మృతి | Baby Died Suspiciously In Medak | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా పసికందు మృతి

Mar 3 2021 9:01 AM | Updated on Mar 3 2021 9:01 AM

Baby Died Suspiciously In Medak  - Sakshi

రేగోడ్‌(మెదక్‌): అభం శుభం తెలియని పసికందు అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన రేగోడ్‌ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, అల్లాదుర్గం సీఐ జార్జి తెలిపిన వివరాల ప్రకారం.. రేగోడ్‌ మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్‌ పోచమ్మ దంపతులకు ఇది వరకు ఇద్దరు కుమారులు ఉండగా రెండోబాబు ఏడాది క్రితం చనిపోయాడు. తొమ్మిది రోజుల క్రితం పోచమ్మ మరో బాబుకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో పసికందు అనుమానాస్పదంగా మృతిచెందాడు.

ఇంట్లో లక్ష్మన్, పోచమ్మలతో పాటు మరో ఐదుగురు ఉంటున్నారు. లక్ష్మన్‌ పాత సామగ్రి (స్క్రాప్‌) వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పసికందు మృతిచెందిన ఘటనా స్థలికి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు చేరుకుని క్లూస్‌కోసం పరిశీలించారు. పసికందు తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో పెద్దశంకరంపేట ఎస్‌ఐ నరేందర్, స్థానిక హెడ్‌ కానిస్టేబుల్‌ పూర్యానాయక్, సిబ్బంది పాల్గొన్నారు.  

చదవండి : (బైక్‌ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య)
(మంచి నిద్రలో ఉండగా..గొలుసు మాయం!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement