ఆటోడ్రైవర్‌ అఘాయిత్యం.. మైనర్‌ బాలికపై స్నేహితులతో కలిసి | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ అఘాయిత్యం.. మైనర్‌ బాలికపై స్నేహితులతో కలిసి

Published Wed, Dec 15 2021 9:15 AM

Auto Driver Molested On Girl In Hyderabad - Sakshi

సాక్షి, లంగర్‌హౌస్‌(హైదరాబాద్‌): మైనర్‌ బాలికపై ఆటో డ్రైవర్‌ లైంగికదాడికి పాల్పడిన ఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా బడా నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసు నీరుగార్చే యత్నం చేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. లంగర్‌హౌస్‌ ప్రాంతంలో నివాసముండే బాలిక పాఠశాలలో చదువుకుంటోంది.

నిత్యం స్కూల్‌కు వెళ్లి వచ్చే క్రమంలో ఆటో డ్రైవర్‌ బాలిక వెంటపడ్డాడు. ఆదివారం ఉదయం దుకాణానికి వెళ్లిన బాలికను స్నేహితుడితో కలిసి ఆటోలో ఓల్డ్‌సిటీలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై తన స్నేహితుడితో కలిసి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.

బాలిక కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఆటో నంబర్‌ ఆధారంగా సోమవారం ఉదయం బాలిక ఆచూకీ తెలుసుకున్నారు.

అనంతరం బాలికను భరోసా కేంద్రానికి తరలించగా పలుమార్లు లైంగికదాడి జరిగినట్లు ఆమె తెలిపింది. ఆటోడ్రైవర్‌ను కాపాడేందుకు బడా నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాలిక కుటుంబ సభ్యులు 
వేడుకుంటున్నారు.   

చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం..

Advertisement
Advertisement