చంద్రగిరిలో యధేచ్చగా గంజాయి రవాణా! | AP Cime News: Ganja Caught Chandragiri From Car Parcels | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో యధేచ్చగా గంజాయి రవాణా! స్పీడ్‌ బ్రేకర్స్‌ వల్ల..

Aug 17 2024 8:35 PM | Updated on Aug 17 2024 8:43 PM

AP Cime News: Ganja Caught Chandragiri From Car Parcels

తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో జోరుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా వెలుగుచూసింది. గాదంకి టోల్ ప్లాజా దగ్గర ఓ కారు అతివేగంగా దూసుకెళ్లింది. అయితే స్పీడ్ బ్రేకర్ వద్ద కారు డిక్కీలో నుంచి రెండు పార్సిల్స్‌ కింద పడ్డాయి. పోలీసులు వాటిని తనిఖీ చేయగా.. అందులో గంజాయి కనిపించింది. అది రెండు కేజీల దాకా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల్లో కారు వెళ్లిన దృశ్యాలు నమోదు కాగా.. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement