పెళ్లైనప్పటి నుంచే పద్మజ అంటే చిన్నచూపు.. అనుమానంతో

Anil Kumar Kills His Wife With Axe in Anantapur District - Sakshi

పెనుభూతమైన అనుమానం  

కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త  

సాక్షి, అనంతపురం క్రైం: అనుమానం పెనుభూతమైంది. కష్టసుఖాల్లో కడదాకా తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి కట్టిన తాళి కాస్త ఎగతాళైంది. కాలయముడిలా గొడ్డలితో భర్త సాగించిన పాశవిక దాడిలో చివరకు వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని ఉమానగర్‌కు చెందిన అనిల్‌కుమార్, పద్మజ అలియాస్‌ లావణ్య (33) దంపతులు. 14 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు సంతానం. అనిల్‌కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. పెళ్లైనప్పటి నుంచి పద్మజ అంటే అనిల్‌ కుమార్‌కు చిన్నచూపు. అనుమానంతో తరచూ ఆమెను వేధించేవాడు.

చదవండి: (కలిసి మద్యం తాగారు.. ఊపిరి ఉండగానే పాతేశారు)

పలుమార్లు ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చచెబుతూ వచ్చేవారు. అయినా అనిల్‌కుమార్‌లో మార్పు రాలేదు. బుధవారం ఉదయం పిల్లలిద్దరూ స్కూల్‌కు వెళ్లారు. ఆ సమయంలో పద్మజతో అనిల్‌కుమార్‌ గొడవపడ్డాడు. తన మాట వినలేదన్న కోపంతో ఇంటిలో ఉన్న గొడ్డలి తీసుకుని ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. తల ఎడమవైపు, కుడి కణతి వైపు, తల వెనుక నరికాడు.

చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..)

బలమైన గాయాలు కావడంతో ఒక్కసారిగా పద్మజ కుప్పకూలి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని మృతి చెందింది. భార్య మృతి చెందిన విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత అనిల్‌కుమార్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top