మోడల్‌ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..

28 Year Old Model Murdered Leg Found Inside Fridge At Hong kong - Sakshi

ఇటీవలకాలంలో కోపంతో లేదా మరేదైనా ఇతర కారణాలతోనూ హత్యలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వారిలోంచి వికృతమైన సైకో బయటకు వచ్చి.. బాధితుల కుటుంబసభ్యులు కడసారిచూపు దక్కనివ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసుగా చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలాంటి దారుణ ఘటనే హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. హాంకాంగ్‌లోని అబ్బి చోయి అనే 28 ఏళ్ల మోడల్‌ హత్యకు గురైంది. ఆమె కాళ్లను నగరశివార్లలోని ఒక ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో గుర్తించారు పోలీసులు.  ఆ ప్రాంతంలోని మృతదేహాన్ని కోసేందుకు వినియోగించే ఎలక్ట్రిక్‌ రంపాన్ని కూడా కనుగొన్నారు. ఇంకా.. ఆమె శరీరంలోని మొండెం, తల, చేతులు గుర్తించాల్సి ఉంది. ఇటీవలే ఎల్‌ అఫియల్‌ మొనాకో ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ డిజిటల్‌ కవర్‌పై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ఈ కేసుకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి శరీర భాగాల కోసం గాలిస్తుండగా... స్థానిక మ్యాగజైన్‌లో ఆమె ఫోటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హాంకాంగ్‌ పోలీసులు మాట్లాడుతూ..ఈ హత్యకు సంబంధించి ఆమె మాజీ భర్తను, బావా, అతని సోదరుడు, అత్తగారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మోడల్‌ చోయి మంగళవారం  నుంచి కనిపించకుండా పోయిందని, చివరిసారిగా తాయ్‌ పీఓ జిల్లాలో కనిపించిందని తెలిపారు. ఆమె శరీర భాగాలను ఆ జిల్లాలోని గ్రామంలోనే గుర్తించారు. మిగతా భాగాల కోసం డ్రోన్‌ల తోహా అధికారుల బృందం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. 

(చదవండి: పాక్‌, చైనాలకు సాయం కట్‌ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి)

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top