పాక్‌, చైనాలకు సాయం కట్‌ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి

Nikki Haley Said Cut Every Cent In Foreign Aid That US Hated Countries - Sakshi

రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాను అదికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందో చెబుతూ.. ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నిక్కీ అమెరికా విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పాక్‌,  చైనాతో పాటు అమెరికాను ద్వేషించే శత్రు దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని చెప్పారు. గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల సొమ్మును వృధా చేయదన్నారు. అమెరికా గతేడాది విదేశీ సహాయం కోసం 46 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

అది ఇతర దేశాల కన్నా ఎక్కువ అని కూడా చెప్పారు. అంతేగాదు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో పన్ను చెల్లింపుదారులు తెలుసుకునే హక్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ సొమ్ము అంతా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు నిధులు సమీకరించడానికి వెళ్తుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే మాత్రం అమెరికా విరోధులకు అందించే సాయంలోని ప్రతి పైసాలో కోత విధిస్తానని కరాకండీగా చెప్పారు. బైడెన్‌ ప్రభుత్వం పాక్‌కి మళ్లీ సైనిక సాయాన్ని ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు నిలయమైన ఆ దేశ ప్రభుత్వం అమెరికాను వ్యతిరేకించే చైనాకు లోబడి ఉంది. అంతేగాదు పాలస్తీనా ప్రజల కోసం అని అమెరికా యూఎన్‌  అవినీతి ఏజెన్సీని అర బిలియన్‌ డాలర్లతో పునురుద్ధరించిందన్నారు.

అలాగే ఇరాన్‌కి యూఎస్‌ సుమారు రెండు బిలయన్‌ డాలర్లు సాయం అందిస్తే..అది యూఎస్‌  దళాలపైనే దాడులకు దిగింది. అంతేగాదు యూఎన్‌లో అమెరికాకు అత్యంత వ్యతిరేకంగా ఓటింగ్‌​ వేసే దేశాల్లో ఒకటైన జింబాబ్వేకు కూడా  వందల బిలయన్‌ డాలర్లు అందించింది. అత్యంత హాస్యాస్పదమైన విషయమేమిటంటే. .చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉన్నప్పటికీ పర్వావరణ కార్యక్రమాల పేరుతో  చైనాకు డాలర్లు అందిస్తోంది. అంతేగాదు రష్యన్‌ నియంత వ్లాదిమర్‌ పుతిన్‌ అత్యంత సన్నిహితమైన బెలారస్‌కి కూడా సాయం అందించాం. అలాగే క్యూబాకి కూడా సాయం అందించాం. " అంటూ విరుచుకుపడ్డారు నిక్కీ హేలీ.

ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. కేవలం అధ్యక్షుడు జో బైడెన​ మాత్రమే కాదు ఇరు పార్టీల అధ్యక్షులు దశాబ్దాలుగా విదేశీ సాయం విషయంలో ఇలాగే కొనసాగారు. వారంతా మా సహాయన్ని స్వీకరించే దేశాల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికా వ్యతిరేక దేశాలకు సాయం చేసి డాలర్లను వృధా చేయనని చెప్పారు. మన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అలాంటి దేశాలకు నిధులుగా అందించేదే లేదని తెగేసి చెప్పారు నిక్కీ హేలీ.

(చదవండి: పాపం శ్రీలంక.. తిందామంటే జనాలకు తిండి లేదు.. ఇక ఎన్నికలు ఎలా?)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top