ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి అఘాయిత్యం | 21 Year Old Boy Molested Minor Girl In Adilabad | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి అఘాయిత్యం

Aug 25 2020 10:11 AM | Updated on Aug 25 2020 10:11 AM

21 Year Old Boy Molested Minor Girl In Adilabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జైనథ్‌(ఆదిలాబాద్‌): ముక్కు పచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం నిరాల గ్రామంలో చోటు చేసుకుంది. జైనథ్‌ ఎస్సై రామయ్య కథనం ప్రకారం.. నిరాల గ్రామానికి చెందిన బోయర్‌ ఆకాశ్‌ (21) అనే యువకుడు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారికి ఆదివారం సాయంత్రం మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆమె బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో పాప ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.

రాత్రి భోజనం చేసే సమయంలో ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఏమైందని గట్టిగా ప్రశ్నించారు. కడుపులో నొప్పిగా ఉందని, తాను అన్నం తినలేనని ఏడ్చుకుంటూ జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి సోమవారం జైనథ్‌ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షలు, చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement