నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు దుర్మరణం​ | 2 Last Breath And 4 Injured In Nellore Road Accident | Sakshi
Sakshi News home page

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు దుర్మరణం​

Mar 16 2021 9:54 AM | Updated on Mar 16 2021 1:43 PM

2 Last Breath And 4 Injured In Nellore Road Accident - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెళ్లకూరు మండలం నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిపై తల్వాయిపాడువద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్నా  కారు ఢీకొనడంతో  ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొనింది. దీంతో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం మోదుగుల పాలెం గ్రామానికి  చెందిన  కూలీలు ప్రతిరోజూ నాయుడుపేటకు వచ్చి లారీ కాటా పనులు జీవనం సాగిస్తుంటారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి నాయుడుపేటకు పనుల నిమిత్తం ఆటోలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ధీంతో ఆటో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా ఉన్న టిప్పర్ ఆటోను ఢీకోనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అప్పాడి రమేష్ (39), వెంకటేశ్వర్లు (28)  అక్కడికక్కడే మృతి చెందారు. ఇక గురవయ్య, మునుస్వామి, గురునాధం,చెంగయ్య ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల నిమ్మిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement