పిల్లను ఇవ్వడని మామపై కత్తితో దాడి.. ఆ కోపంలో మరదలిపైనా.. | Man Attack On Uncle At Prakasam Over Marriage Of His Daughter | Sakshi
Sakshi News home page

పిల్లను ఇవ్వడని మామపై కత్తితో దాడి.. ఆ కోపంలో మరదలిపైనా..

Feb 4 2022 11:55 AM | Updated on Feb 4 2022 12:06 PM

Man Attack On Uncle At Prakasam Over Marriage Of His Daughter - Sakshi

ప్రకాశం : పెళ్లి చేసుకునేందుకు పిల్లను ఇవ్వడం లేదని మామపై ఓ మేనల్లుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పీరాపురంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బండి శివ తన మామను కలిసి పెళ్లి చేసుకునేందుకు కుమార్తెను తనకు ఇవ్వాలని కోరాడు. తనకు ఇష్టం లేదని మామ మారంరెడ్డి నరసింహారెడ్డి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మామపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమార్తెపై కూడా అదే కత్తితో చేతిపై కోసి గాయపరిచాడు. క్షతగాత్రులను స్థానికులు ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ సురేష్‌కు సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శివను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement