సౌత్‌జోన్‌ పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు | - | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఇటీవల నిర్వహించిన అంతర్‌ కళాశాలల గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికయ్యారు. వారిని బుధవారం ప్రిన్సిపాల్‌ భీమన్న అభినందించారు. ఆయన మాట్లాడుతూ అకడమిక్‌ విద్యతో పాటు క్రీడలను ప్రొత్సహిస్తున్నామని, ఎంతో మంది విద్యార్థినులు క్రీడలలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని ప్రశంసించారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి భారతి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ విద్యుల్లత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement