ముద్ర తప్పితే మునిగినట్టే | - | Sakshi
Sakshi News home page

ముద్ర తప్పితే మునిగినట్టే

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

ఓటు ముద్ర.. చెల్లక ఓటమి మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభావం సర్పంచ్‌ ఎన్నికల అభ్యర్థుల్లో కలవరం నమూనా బ్యాలెట్‌తో ఓటర్లకు అవగాహన ముఖ్యం

● బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఉన్న గడిలో కాకుండా.. రెండు గదుల మధ్య గీతలపై ముద్ర వేయడం.

● ఒకే బ్యాలెట్‌పై ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేయడం.

● ఓటు ముద్ర వేయకుండా ఖాళీ బ్యాలెట్‌ పత్రాన్ని బాక్సులో వేయడం.

● బ్యాలెట్‌ పేపర్‌పై ఓటరు తన పేరు, సంతకం, ఫోన్‌ నంబరు రాయడం లేదా ఇతర గుర్తులు, గీతలు గీయడం.

● ప్రిసైడింగ్‌ అధికారి సంతకం, సీలు లేని బ్యాలెట్‌ పత్రాలు, చిరిగిపోయిన బ్యాలెట్‌ పత్రాలు కూడా చెల్లుబాటు కావు.

● ఎన్నికల సిబ్బంది ఇచ్చిన స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర వస్తువులతో గుర్తు వేయడం, వేలిముద్రలు వేయడం, సొంత పెన్నులు, ఇతర వస్తువులతో గుర్తులు పెట్టడం.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లావ్యాప్తంగా ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 6,84,681 ఓట్లలో చెల్లని ఓట్లు 14,845 నమోదయ్యాయి. అలాగే ఎంపీటీసీ ఎన్నికల్లో 6,20,119 ఓట్లకు గాను 14,322 చెల్లని ఓట్లు పడ్డాయి. పలు స్థానాల్లో విజేతలకు వచ్చిన మెజారిటీ కన్నా చెల్లని ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే అభ్యర్థుల విజయావకాశాలు ప్రభావితమయ్యే ఆస్కారముంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నమూనా బ్యాలెట్‌తో ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ఎందుకు చెల్లడం లేదంటే..

జాగ్రత్తలు తప్పనిసరి

బ్యాలెట్‌ పేపర్‌పై నచ్చిన అభ్యర్థి పేరు, గుర్తు ఉన్న బాక్సు లోపల మధ్యలో ముద్ర వేయాలి. సిరా మరకలు మరో అభ్యర్థి గుర్తుపై పడకుండా పత్రాన్ని జాగ్రత్తగా మడతపెట్టాలి.

బ్యాలెట్‌ పేపర్‌పై పొరపాటున సంతకం చేసినా.. వేలిముద్ర వేసినా.. ఓటు ముద్ర వేసేటప్పుడు పత్రం చిరిగిపోయినా.. ఇంకు మరకలు అంటినా దానిని బ్యాలెట్‌ బాక్సులో వేయకుండా ప్రిసైడింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. ఆయన విచక్షణ మేరకు మరొక బ్యాలెట్‌ పత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలెంజ్‌ ఓటు తరహాలోనే ఈ అవకాశాన్ని పొందవచ్చు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమే. పలువురు అభ్యర్థులు ఒకటి రెండు ఓట్ల తేడాతో ఓటమి పాలవుతుంటారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు పోలవడం.. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సర్పంచ్‌ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement