జెడ్పీ చైర్‌పర్సన్‌గా శైలజ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్‌గా శైలజ

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

● వైస్‌ చైర్‌పర్సన్‌గా మంజుప్రియ ● నోటిఫికేషన్‌ విడుదల ● రేపటి నుంచి నామినేషన్లు స్వీకరణ ● చిత్తూరు, జీడీనెల్లూరు నియోజకవర్గాల మండలాల్లో ఎన్నికలు

● వైస్‌ చైర్‌పర్సన్‌గా మంజుప్రియ

చిత్తూరు కార్పొరేషన్‌: జెడ్పీ చైర్‌పర్సన్‌గా పూతలపట్టు జెడ్పీటీసీ సభ్యురాలు శైలజను నియమిస్తూ టీడీపీ గురువారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు ఆమె శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఈ పదవి కోసం బంగారుపాళ్యం జెడ్పీటీసీ సభ్యురాలు సుచిత్ర, గుడిపాల జెడ్పీటీసీ సభ్యురాలు మమతశ్రీ, పాలసముద్రం జెడ్పీటీసీ సభ్యురాలు జాహ్నవి పోటీపడ్డారు. చివరి నిమిషం వారికి జెడ్పీ పీఠం ఎవరికిస్తారా అని ఉత్కంఠ కొనసాగింది. గురువారం అర్ధరాత్రి శైలజను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా గుడుపల్లె జెడ్పీటీసీ సభ్యురాలు మంజుప్రియను ఎంపిక చేశారు.

సర్పంచ్‌, వార్డు సభ్యుల బ్యాలెట్‌లో నోటా

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈసారి సర్పంచ్‌ ఎన్నికల్లోని బ్యాలెట్‌ పేపర్‌లో నోటా కూడా చేరనుంది. సర్పంచ్‌ బ్యాలెట్‌తో పాటు వార్డు సభ్యుల బ్యాలెట్‌లోనూ నోటా ముద్రించనున్నారు. ఇప్పటికే చెల్లని ఓట్లతో అభ్యర్థులు తలరాతలు మారే అవకాశం ఉండగా తాజాగా నోటా కూడా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నోటా కారణంగా ఎంతమంది అభ్యర్థుల తలరాతలు మారుతాయో వేచి చూడాలి.

పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత డిసెంబర్‌ 2న

చిత్తూరు కార్పొరేషన్‌: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం నుంచి మొదలుకానుంది. ఈ మేరకు 21వ వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న ఉదయం 8 గంటల నుంచి పరిశీలన, 25న అప్పీళ్లు చేసుకోవచ్చు. 26న అప్పీళ్లను పరిశీలిస్తారు. 27న ఉపసంహరణ, అదేరోజు పోటీలో ఉన్న వారి తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. డిసెంబర్‌ 2న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. చిత్తూరు మండలం, గుడిపాల, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, శ్రీరంగరాజ పురం, వెదురుకుప్పం, పాలసముద్రం, పెనుమూరు మండలాల్లోని 182 పంచాయతీలు, 1,676 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మహిళా ఓటర్ల అధికం

మూడో విడత ఎన్నికలు జరగనున్న 8 మండలాల్లో పురుష ఓటర్లు 1,30,685 మంది, మహిళా ఓటర్లు 1,33,824 మంది కలిపి మొత్తం 2,64,509 మంది ఉన్నారు. అత్యధికంగా గంగాధర నెల్లూరులో 32 పంచాయతీలు, అత్యల్పంగా చిత్తూరు మండలంలో 17 పంచాయతీలున్నాయి. మొత్తం 1,676 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సమయాత్తమవుతున్నారు.

ఓపెన్‌ వర్సిటీ స్టడీ సెంటర్‌

కోఆర్డినేటర్‌గా సరిత

తిరుపతి సిటీ: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌గా వాణిజ్య శాస్త్ర విభాగం అధ్యాపకురాలు సరితను నియమించినట్టు ప్రిన్సిపాల్‌ భీమన్న తెలిపారు. సీ్త్ర విద్యను ప్రోత్సహించడానికి కళాశాల నిరంతరం పనిచేస్తుందన్నారు. వివిధ కారణాల వల్ల కళాశాలలకు వెళ్లి చదువుకోవడానికి అవకాశం లేని మహిళలకు దూరవిద్య ద్వారా విద్యను అభ్యసించడం ఒక వరమని పేర్కొన్నారు.

టీటీడీ వస్త్రాల ఈ–వేలం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్‌ సిల్క్‌ చీరలను ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఈ–వేలం వేయనున్నారు. మొత్తం 115 లాట్ల న్యూ ఆర్ట్‌ సిల్క్‌ చీరలను ఈ–వేలం ఐడీ నంబర్లు 28814 నుంచి 28819 వరకు వేలం వేయనున్నారు. ఆసక్తి గల బిడ్డర్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. పూర్తి వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్‌ మేనేజర్‌ (వేలములు) కార్యాలయం లేదా ఏఈవో (వేలములు) కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా 0877–2264429 ఫోన్‌ నంబర్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement