నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

– 8లో

– 8లో

కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక వాయిదా

వైస్‌ చైర్మన్‌గా ఒకరికే అవకాశం

గత ప్రభుత్వంలో ఇద్దరికి చోటు

జెడ్పీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

27 ఎంపీపీలు, 27 వైస్‌ ఎంపీపీల ప్రమాణస్వీకారం

దూసుకొచ్చిన మృత్యువు..!
పలమనేరు మండలం పెరంగుంట వద్ద ఓ కారు జనంపై దూసుకువెళ్లిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లా పరిషత్‌ పీఠంపై మరోసారి మహిళ పాలన మొదలుకానుంది. ఇటీవల వెలువడిన పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న కూటమి పార్టీలకు చెందిన మహిళా జెడ్పీటీసీ జిల్లా పరిషత్‌ పీఠమెక్కనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది.

మధ్యాహ్నం ఎంపిక

జెడ్పీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంటకు జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులు చేతులెత్తి పరోక్ష పద్ధతిలో జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. చివరిగా నూతన జెడ్పీ చైర్‌పర్సన్‌ జెడ్పీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికోసం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాల మేరకు జెడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యులకు ఐడీ కార్డులు అందజేసి వారిని మాత్రమే సమావేశ మందిరంలోనికి అనుమతించనున్నారు. అలాగే శాంతిభద్రతలు విఘాతం కాకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక వాయిదా

మండలానికి ఒక కో–ఆప్షన్‌ సభ్యుడు, జెడ్పీకి ఇద్దరు కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుని, తర్వాత ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలి. కానీ గురువారం కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక వాయిదా వేస్తూ ఆదేశాలొచ్చాయి. దీంతో తాత్కాలికంగా వారి ఎంపిక వాయిదా పడింది.

నాడు ఇద్దరు.. నేడు ఒక్కరే

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చైర్మన్‌తో పాటు ఇద్దరు వైస్‌ చైర్మన్లను నియమించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఒకరే వైస్‌ చైర్మన్‌ను కొనసాగించాలంటూ సవరణ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులే పెదవి విరుస్తున్నారు. కూటమిలో ఉన్నా మిత్రధర్మం పాటించడం లేదని, పదవులు అంతా టీడీపీ నాయకులకే దక్కుతున్నాయని జనసేన , బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో 27 మండలాల్లో పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మినహాయించి మిగిలిన 23 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. జెడ్పీ ఆన్‌రిజర్వుడ్‌ మహిళకు కేటాయించారు. ఎవరికి జెడ్పీ పీఠం దక్కునుందో అన్న విషయంపై అధినాయకత్వం తేల్చకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒకే సామాజికవర్గానికి చెందిన నలుగురు జెడ్పీటీసీలు ఎవరికివారు తామే కాబోయే చైర్‌పర్సన్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం అయ్యాక కోరం ప్రకారం జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకుగాను తొలుత విప్‌ జారీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement