పట్టించుకోని పాలకులు.. | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోని పాలకులు..

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ఒక్కో విద్యార్థికి ఏడాదికి సరాసరి అందాల్సిన మొత్తం రూ.18 వేలు జిల్లాలోని కళాశాలలకు పేరుకుపోయిన బకాయిలు రూ.250 కోట్లపైగా హాల్‌ టిక్కెట్లు ఇచ్చేదిలేదంటున్న కాలేజీల యాజమాన్యాల బెదిరింపులు దిక్కుతోచని స్థితిలో పేద విద్యార్థులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు

విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలన్న వారి కోరిక నెరవేరడం లేదు. ప్రభుత్వం

నుంచి సకాలంలో ఫీజులు విడుదల కాకపోవడంతో జిల్లాలోని పలు ఇంజినీరింగ్‌, డిగ్రీ

కళాశాలల యాజమాన్యాలు కన్వీనర్‌ కోటా విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.

లేనిపక్షంలో హాల్‌ టికెట్లు ఇవ్వబోమని, మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నాయి.

కాణిపాకం: జిల్లాలో 60కు పైగా యూజీ, ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయలేదు. జిల్లాలోని ఒక్కో విద్యార్థికి ఏడాదికి సరాసరి రూ.18 వేలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సుమారు రూ.250 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో బకాయిలను విద్యార్థుల నుంచే ముక్కుపిండి వసూలు చేసేందుకు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. పూర్తి ఫీజు చెల్లించని పక్షంలో కనీసం పరీక్ష ఫీజులు కూడా కట్టించుకోవడం లేదు. ఒకవేళ పరీక్ష ఫీజు చెల్లించే గడువు ఒక్క రోజు దాటినా జరిమానాగా కొన్ని కాలేజీల్లో రూ.1000, రూ.2 వేలు వసూలు చేస్తుండగా, మరికొన్ని కాలేజీల్లో రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు అటెండెన్స్‌ పేరుతో మరో రకమైన దోపిడీకి తెరలేపాయి. హాజరు 65 శాతానికి పైగా ఉంటే రూ.5 వేలు, అంతకంటే తక్కువగా ఉంటే రూ.30 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు, పలువురు అధ్యాపకులు సైతం మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వసూళ్ల దందాతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హాల్‌ టిక్కెట్లు నిలిపివేస్తూ..

అడిగినంత డబ్బు కట్టని విద్యార్థులను పలు కాలేజీల యాజమాన్యాలు తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే పరీక్షల సమయంలో హాల్‌ టిక్కెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం, పరీక్షలను వాయిదా వేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ప్రాక్టికల్స్‌, ఇంటర్నల్‌ మార్కుల్లో కోతలు పెడతామని బహిరంగంగానే బెదిరిస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మార్కులు తగ్గితే తమ కెరీర్‌ దెబ్బతింటుందన్న భయంతో విద్యార్థులు కుమిలిపోతున్నారు. ఆర్థిక స్థోమత లేక కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన పేద విద్యార్థులు, యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక చదువు మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి నెలకొంది. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపు చేయడానికి మోహరించిన పోలీసులు

తమకు జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులు పలుమార్లు జిల్లా పాలకులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కరువైంది. విద్యాసంస్థల యాజమాన్యాల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నామని, వేల రూపాయల ఫీజులు, జరిమానాలు ఎక్కడి నుంచి తీసుకురావాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు తమ ఫీజు గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నేతలు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన

కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫీజుల వేధింపులతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందన్న అసత్య ప్రచారంతో చిత్తూరు నగర శివారులోని ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో యాజమాన్యం తమను పీల్చిపిప్పి చేస్తోందని, అధిక ఫీజులు, అడ్డగోలు జరిమానాలతో వేధిస్తోందని ఆరోపిస్తూ 1000 మందికి పైగా విద్యార్థులు రోడ్డెక్కారు. సుమారు ఐదు గంటల పాటు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిని దిగ్బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement