నేడు పల్లె ఎన్నికల నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పల్లె ఎన్నికల నోటిఫికేషన్‌

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

● షెడ్యూల్‌లో మార్పు ● మూడు విడతల్లో ఎన్నికలు ● మొత్తం ఓటర్లు 10,22,742 మంది

– 8లో

ట్రక్‌ లారీ ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి
ఆటోను ట్రక్‌ లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌ మృతిచెందాడు. ఐదుగురు నర్సింగ్‌ విద్యార్థినులు గాయపడ్డారు.

చిత్తూరు కార్పొరేషన్‌ : పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల కానుంది. జిల్లాలోని 617 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత తొలి విడతలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాలు, రెండో విడతలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలు, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు, మూడో విడతలో నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లోని పంచాయతీలకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను మార్పు చేస్తూ ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మొదటి విడతలో పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు, రెండో విడతలో పూతలపట్టు, నగరి నియోజకవర్గాలతో పాటు రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు, మూడో విడతలో జీడీనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని మొత్తం 617 సర్పంచులు, 5,866 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి మొదటి విడతలో 9 మండలాలు, రెండో విడతలో 10 మండలాలు, మూడో విడతలో 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలో మొత్తం గ్రామీణ ఓటర్లు 10,22,742 మంది ఉండగా, వారిలో ఎస్టీ ఓటర్లు 28,973 మంది, ఎస్సీ ఓటర్లు 2,47,416 మంది, బీసీ ఓటర్లు 4,70,795 మంది, ఓసీ ఓటర్లు 2,75,558 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 8,608 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 1,075 ప్రాంతాల్లో 5,886 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 27 మండలాల్లో 135 నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 6,473 పోలింగ్‌ బాక్స్‌లను సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement