పిల్లల హక్కులపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లల హక్కులపై అవగాహన ఉండాలి

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : పిల్లలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి తెలిపారు. స్థానిక గాండ్లపల్లె నగరపాలకోన్నత పాఠశాల, విజ్ఞానదీప్తి పాఠశాలలో గురువారం సురక్షిత బాల్యం – బాలల రక్షణ ఉద్యమం పేరుతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. మంచి స్పర్శ–చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం, వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులకు తెలియజేయాలన్నారు. పోక్సో చట్ట ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. బాలల భద్రత మనందరి బాధ్యత–ప్రతి బాల్యాన్ని సురక్షితంగా కాపాడుదామని పేర్కొన్నారు. సదస్సులో పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement