ఓట్ల లెక్కింపు సక్రమంగానే చేస్తారా..? జిల్లాలోని 6 ప్రాంతాలు.. 7 కేంద్రాల్లో ఏర్పాట్లు తొలుత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
ఏజెంట్లకు నిబంధనలు
చిత్తూరు కలెక్టరేట్/ చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. అలాగే కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపులో 89 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 702 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న 7 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట ఎంపీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించి ఆ తర్వాత జెడ్పీటీసీ అభ్యర్థులు ఓట్లు లెక్కించనున్నారు.
పురపాలక లెక్కింపు నవ్వులపాటు
ఇటీవల నిర్వహించిన చిత్తూరు నగరపాలక ఎన్నికల కౌంటింగ్ నవ్వులపాలైంది. చిత్తూరు నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేడాలు రావడం, కౌంటింగ్ ఏజెంట్‌లకు సమాచారం ఇవ్వడంలో అలసత్వం వహించడం వంటివి చోటు చేసుకున్నాయి. చిత్తూరు నగరపాలక ఓట్ల లెక్కింపులో జిల్లా యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్యం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మేయర్ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో రౌండ్ల వారీగా కౌంటింగ్ పూర్తి అయినప్పటికీ పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లున్నాయి. అధికారులు ప్రకటించిన లెక్కలకు ఏ మాత్రం పొంతలేకుండా పోయింది. దీంతో ఏ స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారో అని అధికారులే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈసారైనా ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తారా.....లేక మళ్లీ పాత తప్పిదాలనే పునరావృత్తం చేస్తారా అని అభ్యర్థులు మధనపడుతున్నారు.
అధికార పార్టీ తొత్తులుగా..
ప్రజాస్వామ్యవ్యవస్థలో ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలు అత్యంత ముఖ్యమైనవి. అటువంటి ఓటింగ్ ప్రక్రియలో దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని బజారున పడేశారు. అధికారపార్టీకి తొత్తులుగా మారిన కొందరు అధికారులు ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ను సైతం ప్రహసనంగా జరిపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పీవీకేఎన్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన టేబుళ్లు
ఎస్వీ సెట్ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ట్రైనీ కలెక్టర్ వెంకటేష్
ఎన్నికలు జరిగిన స్థానాలు, అభ్యర్థులు
విభాగం మొత్తం స్థానాలు ఏకగ్రీవాలు పోలింగ్ జరిగిన స్థానాలు అభ్యర్థుల సంఖ్య జెడ్పీటీసీ 27 3 24 89
ఎంపీటీసీ 370 70 300 702
కౌంటింగ్ కేంద్రాల వివరాలు
నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రం
జీడీనెల్లూరు : సీతమ్స్ ఇంజినీరింగ్
కళాశాల, చిత్తూరు
చిత్తూరు, పుంగనూరు : పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ
కళాశాల,చిత్తూరు
పూతలపట్టు : ఎస్వీసెట్, చిత్తూరు
కుప్పం : ప్రభుత్వ ఒకేషనల్
జూనియర్ కళాశాల, కుప్పం
పలమనేరు పార్ట్–1 : ఎస్‌వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ
కళాశాల, పలమనేరు
పలమనేరు పార్ట్–2 : పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత
పాఠశాల, పలమనేరు
నగరి : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నగరి


