చిత్తూరు కార్పొరేషన్ : టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మునిరత్నానికి తన వంత ఆర్థిక సాయం అందించినట్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపా రు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరపాలక ఎన్నికల పోలింగ్ రోజున తోటపాళ్యంలోని పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అన్నామలై తరఫున మునిరత్నం ఏజెంటుగా కూర్చున్నారని, అది ఇష్టం లేని టీడీపీ నాయకుడు గణేష్, ఆయన అనుచరులు దాడికి పాల్ప డ్డారని మండిపడ్డారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశారని, మరి కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు వివరించారు. అందుకే ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. బాధితుడి భార్య ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వరసిద్ధుని సేవలో విదేశీ భక్తులు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని శుక్రవారం పలువురు విదేశీ భక్తు లు సేవించుకున్నారు. అమెరికా, జర్మనీ, రష్యా దేశాలకు చెందిన భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ విశిష్టతను వివరించారు. వినాయక స్వామివారి దివ్య మంగళ రూప దర్శనంపై విదేశీ భక్తులు హర్షం వ్యక్తం చేశారు.


