పరిషత్‌ కౌంటింగ్‌కు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ కౌంటింగ్‌కు పటిష్ట భద్రత

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటిగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత కల్పించినట్లు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ మూడంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యాధునిక డ్రోన్‌ కెమెరాలు, సీపీ కెమెరాల ద్వారా కౌంటింగ్‌ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్లు, ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టామని చెప్పారు. చిన్న సమస్య ఎదురైనా తక్షణమే స్పందించేందుకు ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. ఫలితాల అనంతరం గెలుపొందిన అభ్యర్థులు కానీ, వారి మద్దతుదారులు కానీ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహించకూడ దని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో కూడిన డీజే లు, మైక్‌ సెట్లు వినియోగించడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల సమీపంలో పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30, సెక్షన్‌ 163 అమల్లో ఉంటాయని, అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, సభలు, సమావేశాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తప్పుడు ప్రచారాలు నిర్వహించడం, ఇతర వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కవ్వింపు చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు.

సురక్షిత దీపావళి

పండుగే లక్ష్యం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా ప్రజలు, పోలీసు కుటుంబాలకు ఎస్పీ తుషార్‌ డూడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యా లు నింపాలని ఆకాంక్షించారు. పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, వద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత దీపావళి పండుగే లక్ష్యంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా నంబర్‌112 లేదా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 9440900005కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement