రణరంగంగా రైల్వేకోడూరు | - | Sakshi
Sakshi News home page

రణరంగంగా రైల్వేకోడూరు

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పరిషత్‌ ఎన్నికల్లోనూ టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు, పెనగలూరు మండలం, నల్లపురెడ్డిపల్లి పోలింగ్‌ బూత్‌లోకి ఏజెంట్‌ వెళ్తుండగా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. అనంతరం పోలీసుల సమక్షంలోనే పెట్రోల్‌ బాంబులు వేసి విధ్వంసం సృష్టించాయి. పెనగలూరు మండలంలో ఎప్పడూలేని విధంగా టీడీపీ, జనసేన నాయకులు రౌడీ మూకలతో అల్లర్లు సృష్టించారు. బయట ప్రాంతాల నుంచి నల్లపురెడ్డిపల్లికి దాదాపు యాభై నుంచి అరవై మంది వరకు రౌడీలు గ్రామంలో తిష్టవేశారు. పెట్రో బాంబులు విసిరారు. ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. తలకు గాయం కావడంతో దాదాపు ఐదు కుట్లు వేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే మరో వ్యక్తికి కాలికి గాయం కావడంతో నాలుగు కుట్లు వేశారు. మరో వ్యక్తికి చేతికి, మెడకు రాళ్ల దెబ్బలు తగలడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మండలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు, ఓటములు ఓటర్లు నిర్ణయిస్తారనుకునేవారు, కానీ ఈసారి ఎన్నికల్లో గూడాయిజంతోనే కూటమి నేతలు గెలవాలని ఎత్తుకు పైఎత్తులు వేశారు. నామినేషన్‌ నుంచి గూండాలను వందల సంఖ్యలో పిలిపించి అల్లర్లు సృష్టించారు. అదే ఎన్నికల రోజు కూడా అల్లర్లు సృష్టించి ఏజెంట్లను బూత్‌లలోకి రానియ్యకుండా భయబ్రాంతులను చేసి రిగ్గింగ్‌ చేయాలని టిడిపి నాయకులు ప్లాన్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తిప్పి కొట్టడంతో తిరిగి ఎన్నికలు జరిగాయి. ఏది ఏమైనప్పటికీ పెనగలూరు మండలంలో పెట్రోల్‌ బాంబులు వేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement