బంగారుపాళెం: చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని పాలేరు ఎంపీటీసీ సెగ్మెంట్లోని శేషాపురం పోలింగ్ కేంద్రంలో గురువారం వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై టీడీపీ నాయకులు దాడి చేసి, బయటకు పంపి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. వివరాలు.. శేషాపురం పోలింగ్ కేంద్రం 32లో వైఎస్సార్సీపీ అభ్యర్థి త్రివేణి భర్త ఉమాపతి ఏజెంట్‌గా ఉన్నారు. సాయంత్రం 4.20 గంటల సమయంలో టీడీపీ నాయకుడు ఎన్‌పి విక్రమ్ 30 మంది అనుచరులతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఉమాపతిపై దాడికి పాల్పడ్డాడు. ఉమాపతిని పోలింగ్ కేంద్రం నుంచి వెలుపలికి లాక్కొచ్చి కొట్టడమే కాకుండా చొక్కాను సైతం చించివేశారు. అనంతరం యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు. దీన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్లినట్టు బాధితుడు చెప్పారు. అంతేకాకుండా విక్రం తనను కులం పేరుతో సైతం దూషించాడని పేర్కొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, అభ్యర్థి త్రివేణితో కలసి ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. అలాగే, జంబువారిపల్లె ఎంపీటీసీ సెగ్మెంట్లోని బూత్ నంబర్ 24లో కూడా టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేశారు. టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేసిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్‌చేశారు.


