టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

గంగవరం: మండలంలోని కలగటూరు పంచాయతీలోని పలు గ్రామాలకు చెందిన 10 కుటుంబాలు టీడీపీ, జనసేన పార్టీలను వీడి గురువారం పలమనేరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటేగౌడ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారిలో కేశవులు, యశ్వంత్‌, సునీల్‌, రాజేష్‌, హేమంత్‌, దినేష్‌ తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న మోసాలు, జగనన్న నాయకత్వంపై నమ్మకంతో ఆ పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ నాయకులు నల్లపరెడ్డి, నరసింహులు, మురళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బైరెడ్డిపల్లెలో..

బైరెడ్డిపల్లె : మండలంలోని టిఎన్‌కుప్పం గ్రామానికి చెందిన టీడీపీ వార్డు మాజీ మెంబర్లు నారాయణప్ప, రమేష్‌, మాధవ గురువారం వైఎస్సార్‌సీపీలో చేరా రు. వారికి మాజీ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement