భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

● పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గురువారం సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి–బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తర్వాత ఉత్సవమూర్తులను ఆస్థాన మండపానికి తీసుకెళ్లి కొలువుదీర్చారు. ఉదయం 9 నుంచి 10, 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement