యాదమరిలో తమ్ముళ్లకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

యాదమరిలో తమ్ముళ్లకు షాక్‌

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

● దళవాయిపల్లి నుంచి 40 మంది వైఎస్సార్‌ సీపీలో చేరిక

యాదమరి: అధికార కూటమి ప్రభుత్వానికి మండలంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలోని కొందరు నాయకుల నియంతృత్వ పోకడలు నచ్చక దళవాయిపల్లిలో బొలిగొర్ల కుటుంబానికి చెందిన 40 మంది టీడీపీని వీడారు. వారు బుధవారం చిత్తూరులోని బీఎంఆర్‌ గార్డెన్‌లో మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎనికల్లో ధనుంజయరెడ్డి నాయకత్వంలో యాదమరి మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. 40 మంది పార్టీలో చేరేలా కృషి చేసిన అదే గ్రామానికి చెందిన పండు మందడి, రవీంద్రను మాజీ ఎమ్మెల్యే సునీల్‌, కన్వీనర్‌ ధనుంజయరెడ్డి అభినంధించారు. ఎన్నికల వేళ ప్రస్తుత అధికార పార్టీ మండల అధ్యక్షుడు తన సొంత గ్రామంలో, పైగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో గజేంద్ర, స్కూల్‌ మందడి, ఆనంద్‌, చిన్నబ్బ, రాజేంద్ర, భాస్కర్‌, రాఘవయ్య, వేణు, శంఖర్‌, మణి, సుబ్రమణ్యం, రాజగోపాల్‌, రజని, కృష్ణయ్య, కన్నయ్య, రాజేష్‌, కిరణ్‌, హరీష్‌, భార్గవ్‌, అప్పయ్య, సురేష్‌, వినోద్‌, విజయ్‌, రాజశేఖర్‌, తేజేష్‌, మనోహర్‌, సుబ్రమణ్యం, రవి, చంద్ర, రోహిత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement