జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు నడుం బిగించారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న లాడ్జిలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దాచిన నగదు, మద్యం, ఇతర వస్తువుల కో సం జల్లెడ పట్టారు. లాడ్జిల్లో బస చేసిన వ్యక్తుల గుర్తింపు కార్డులు, ఎంట్రీ రిజిస్టర్లను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరి వివరాలనూ తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచా రం ఇవ్వాలని లాడ్జి నిర్వాహకులను ఆదేశించారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే తాట తీస్తాం

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ హెచ్చరించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే తమ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలు, లాడ్జిలు, అనుమానాస్ప ద కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎంతటి వారికై నా చట్టప్రకారం కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement