కుప్పం/కుప్పం రూరల్ : కుప్పం మండలం అడవిబూదుగూరులో 20 కుటుంబాలు, గుడుపల్లె మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీ పెద్దగొల్లపల్లి, పెద్దభజనవాడ పంచాయతీలోని కమ్మగుట్టపల్లి, పాపానూరు గ్రామాల్లో 31 కుటుంబాలకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వకర్త, ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్సీ భరత్, మండల కన్వీనర్ హెచ్‌ఎం మురుగేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ కూటమి పాలనలో బడుగులకు ఒరిగిందేమీ లేదన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒక్కో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డులకు పదుల సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గెలిచే వారికే టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. కరోనా వంటి భయానక రోజులను వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చాకచక్యంగా అధిగమించారని, కూటమి ప్రభుత్వం కరువును ఎదుర్కొలేక చేతులెత్తేసిందన్నారు. రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు.
20 కుటుంబాలు చేరిక
అడవిబూదుగూరు పంచాయతీలో టీడీపీ నుంచి 20 కుటుంబాలు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి ఎమ్మెల్సీ భరత్, మండల కన్వీనర్ హెచ్‌ఎం మురుగేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో ఎం.బాలక్రిష్ణ, ముత్తుకరుప్పన్, శేఖర్, సిద్ధప్ప, సుబ్రమణ్యం, దొడతమ్మ, సిద్ధప్ప, శింగారవేలు, జ్ఞానశేఖర్, అజిత్, రాజా, రజినీ, మణి, దేవరాజ్, జనార్దన్, తోటప్ప, కనకరాజు, కొన్నప్ప, శేఖర్, వీరభద్రన్, మహేంద్రన్, అరుణాచలం, మద్దప్ప తదితరులు ఉన్నారు. అనంతరం మాజీ మంత్రి రామచంద్రారెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షుడు శీను, జీవి రమేష్, రాజా, చిన్నదొరై, ఈశ్వర్, రమేష్, రాజేంద్రన్, గౌరప్ప, రామన్, విజేంద్రన్, జయకుమార్ ఉన్నారు.
పార్టీలో చేరిన వారిని కండువాతో ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ భరత్, పార్టీ సభ్యత్వం కార్డు పంపిణీ చేస్తున్న భరత్
వైఎస్సార్ సీపీలో చేరిన గుడుపల్లె మండలం
పాపానూరు, కమ్మగుట్టపల్లికి చెందిన టీడీపీ యువత
గుడుపల్లె మండలంలో 31 కుటుంబాలు
చిన్నగొల్లపల్లి పంచాయతీ పెద్దగొల్లపల్లిలో టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న 11 కుటుంబాలకు చెందిన యువకులు సుబ్రమణ్యం, మురుగేష్, మురళీ, జయవేల్, లోకేష్, రామకృష్ణ, అమరేష్, అనీల్ కుమార్, హరికుమార్, చరణ్, సంజయ్, నారాయణ, అదేవిధంగా పెద్దభజనవాడ పంచాయతీలోని కమ్మగుట్టపల్లి, పాపానూరు గ్రామంలో 20 కుటుంబాలకు చెందిన భరత్, గంగరాజు, ప్రసాద్, కార్తీక్, గోవిందప్ప, లక్ష్మప్ప, అంజి, వంశీ, సురేష్, సతీష్, వివేక్, నరసింహులు, వెంకటేష్, నవీణ్ తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి విధానాలు నచ్చి పార్టీలో చేరినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుడుపల్లె మండల పార్టీ కన్వీనర్ రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కృష్ణమూర్తి, మండల బూత్ కన్వీనర్ సంపంగి, మాజీ ఎంపీటీసీ వినాయక, మాజీ సర్పంచ్ నాగభూషణం, కృష్ణప్ప, మంజు, రాజు తదితరులు పాల్గొన్నారు.


