ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర వేశాం. రేషన్ కార్డుల నుంచి పింఛన్ల వరకు ఇంటింటికీ పంపిణీ చేశాం. అన్ని సమస్యలకు పరిష్కారాలు చూపుతూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచాం. అలాంటి మాకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తే ఆర్థిక భారం పడుతుందని తొలగించారు. ఇప్పుడు తమ ప్రభుత్వానికి వంత పాడే సోషల్ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టేందుకు చంద్రబాబు తెగబడుతున్నారు. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారం కాదా..?, ప్రజా ధనం దుర్వినియోగం చేస్తే సర్కారుపై తిరగబడుతాం.
– సాయికుమార్, మాజీ వలంటీర్, కార్వేటినగరం
నమ్మించి మోసం చేశారు
తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పుడు నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. కోవిడ్ సమయలో మా సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. అధికారులు చెప్పిన పనులన్నీ చేశాం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. ఇంత పని చేసినా మాకు రూ.5వేలు ఇస్తే కూడా తృప్తిగా పనిచేశాం. అప్పట్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసిన వారు, ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వారికి రూ.లక్షలు కేటాయించడం న్యాయమా. – బాలాజీ, మాజీ వలంటీర్, బైరెడ్డిపల్లె


