నిర్లక్ష్య వైఖరిపై నిరసన | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్య వైఖరిపై నిరసన

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

ఐరాల : బ్యాంక్‌ మేనేజర్‌ నిర్లక్ష్యపు వైఖరిపై విసుగు చెందిన ఖాతాదారులు మంగళవారం కాణిపాకం యూనియన్‌ బ్యాంకు ఎదుట నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ వివిధ పనుల మీద బ్యాంకుకు వచ్చే రైతులు, ఖాతాదారులు, మహిళలకు, వృద్ధులకు సరైన సేవలు అందించడం లేదని వాపోయారు. ప్రశ్నించిన వారితో దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు, మహిళలు, ఖాతాదారులు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై యూనియన్‌ బ్యాంకు డిప్యూటీ ఆర్‌ఎం పరుశరామ్‌ ఖాతాదారులతో ఫోన్‌లో మాట్లాడారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే మేనేజర్‌ను బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఖాతాదారులు నిరసన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement