ఇదెక్కడి న్యాయం | - | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి న్యాయం

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందించాం. సర్కారుకు జనాలకు వారధిగా వ్యవహరించాం. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించాం. కేవలం రూ.5వేల గౌరవ వేతనంతోనే అహర్నిశలు శ్రమించాం. అలాంటి మమ్మల్ని చంద్రబాబు నిలువునా వంచించారు. బాబు సర్కారు మోసాలు ప్రజలకు కూడా అర్థమయ్యాయి. సోషల్‌ మీడియాలో తమకు వంత పాడేవారికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇదెక్కడి న్యాయం. – సుబ్రమణ్యం, మాజీ వలంటీర్‌, బైరెడ్డిపల్లె

ఆడబిడ్డ నిధి ఆచూకీ లేదు

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేసుకోవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఊదరగొట్టారు. రెండున్నరేళ్లు గడిచినా ఆడబిడ్డ నిధి ఆచూకీ లేదు. ఆర్థిక భారం కారణంగానే ఇవ్వలేకపోతున్నామని, పేద అరుపులు అరిచారు. ఇప్పుడు తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు ప్రజల డబ్బులను దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు రాష్ట్రంపై ఆర్థిక భారం పడదా.. చంద్రబాబు సమాధానం చెప్పాలి.

– దేశమ్మ, ఎంఎం విలాసం, కార్వేటినగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement