ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కుట్రలు

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

● వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవమైతే ఒప్పుకోని రౌడీమూకలు ● అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదావేయించిన పచ్చ నేతలు ● చాలా పాఠశాలల్లో కోరం లేక ఆగిపోయిన కమిటీ ఎన్నికలు ● తల్లిదండ్రుల ఆందోళనతో వెనకడుగు వేసిన ● చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం, రామనపల్లి స్కూల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో 10–2 తేడాతో అధికార పార్టీ సానుభూతిపరులు ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఎన్నిక చెల్లదని మళ్లీ ఎన్నికలు పెట్టాలని ఎంఈఓపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసి నేటికి వాయిదా వేయించారు. ● తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరచిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ నేతలు నియోజకవర్గ ముఖ్య నాయకుడికి ఫోన్‌చేసి విషయం చెప్పారు. ఆయన ఎంఈఓ, హెచ్‌ఎంకి ఫోన్‌చేసి డిక్లరేషన్‌ ఇవ్వకుండా అడ్డుకున్నారు. అయితే స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. చేసేది లేక వైఎస్సార్‌సీపీ బలపరచిన వారే చైర్మన్‌గా ఎన్నికై నట్లు హెచ్‌ఎం ధృవీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ● తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలం, ఆర్లపాడు పాఠశాల స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరచిన వ్యక్తికి మెజారిటీ మంది చేతులెత్తారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఉపాధ్యాయులతో చర్చలు నెరిపారు. టీడీపీ నేత చంద్రశేఖర్‌ మీడియా, స్థానికులపై దాడిగి తెగబడ్డారు. ● తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, ఓజి లి మండలం, కర్రబల్లవోలు ప్రాథమిక పాఠశాల కమిటీ చైర్మన్‌ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ బలపరచిన వ్యక్తికి మెజారిటీ ఓట్లు వచ్చాయి. దీనిపై టీడీపీ నేత లు గొడవకు దిగి ఎన్నికను వాయిదా వేయించారు.

● వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవమైతే ఒప్పుకోని రౌడీమూకలు ● అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదావేయించిన పచ్చ నేతలు ● చాలా పాఠశాలల్లో కోరం లేక ఆగిపోయిన కమిటీ ఎన్నికలు ● తల్లిదండ్రుల ఆందోళనతో వెనకడుగు వేసిన

సాక్షి ప్రతినిధి, తిరుపతి: విద్యాలయాల్లోనూ టీడీపీ నేతల రాజకీయ జోక్యం శ్రుతిమించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మంగళవారం జరిగిన స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో దౌర్జన్య కాండ సాగింది. చైర్మన్‌ గిరిని దక్కించుకునేందుకు పలువురు తెగబడ్డారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను గ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు అనేక చోట్ల ఎన్నికల్లో పాల్గొనలేదు. ఫలితంగా కోరం లేక స్కూల్‌ కమిటీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఏకగ్రీవం అయిన చైర్మన్‌ ఎన్నిక చెల్లదంటూ టీడీపీ నేతలు కుట్రలకు తెరదీశారు. చిత్తూరు మండలం బీఆర్‌పేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఎన్నికల్లో టీడీపీ నేతలు తమ వారికే పీఠం కట్టబెట్టాలన్న దురాశతో.. ఏకంగా ఎన్నికల ప్రక్రియనే నీరుగార్చేశారు. నిబంధనల ప్రకారం ప్రారంభమైన ఎన్నికలను, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అర్థంతరంగా వాయిదా వేయించారు. విద్యాశాఖ అధికారులు అధికార పార్టీకి కీలుబొమ్మలుగా మారడంతో తల్లిదండ్రులు ధర్నాకు ఉపక్రమించారు.

రోడ్డెక్కిన తల్లిదండ్రులు

అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ఉదయం కోరం లేదని చెప్పి, ఆ తర్వాత ఓటింగ్‌ జరపడంపై నిప్పులు చెరిగారు. పరిస్థితి చేయిదాటడంతో అప్రమత్తమైన ఇద్దరు మండల విద్యాశాఖాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో చర్చలు జరిపి శాంతింపజేశారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నామని, త్వరలోనే పూర్తి పారదర్శకంగా మరోసారి కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని వారు రాత పూర్వకంగా హామీ ఇచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సవ్యంగా జరిగేనా

స్కూల్‌ కమిటీ ఎన్నికల్లోనే టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. రేపు మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో కూటమి నేతలు ఏ స్థాయిలో దౌర్జన్యాలకు దిగుతారోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా సమాచారం

ఎన్నికలు నిర్వహించాల్సిన

పాఠశాలలు 2,091

ఎన్నికలు జరిగినవి 2,077

పాల్గొనాల్సిన ఓటర్లు 1,03,000

కోరం లేక వాయిదా పడిన బడులు 04

తల్లిదండ్రుల అనాసక్తి

స్కూల్‌ కమిటీ ఎన్నికలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అనేక పాఠశాలల్లో స్కూల్‌ కమిటీ ఎన్నికలు కోరం లేక వాయిదాపడ్డాయి. అనేక పాఠశాలల్లో 50 శాతం కంటే తక్కువ మంది హాజరు కావడంతో వాయిదా వేస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు ప్రకటించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం మంగానెల్లూరు, తడ మండలం అక్కంపేట మోడల్‌ స్కూల్‌ కమిటీ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement