ఒంటరి ఏనుగు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఒంటరి ఏనుగు బీభత్సం

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

న్యాయమైన హక్కులు కల్పించమని కోరడమే తప్పా

బలవంతంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు

‘చలో విజయవాడ’లో పాల్గొన్నందుకు కక్ష పెంచుకుంటున్నారు

మండిపడుతున్న సచివాలయ ఉద్యోగులు

బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లె సమీపంలో ఒంటరి ఏనుగుల 15 రోజులుగా నానా బీభత్సం సృష్టిస్తోంది.

మంగళవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

తిరుపతి అర్బన్‌: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులు రెండేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనిఒత్తిడి పెరిగిందని ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా పదుల సంఖ్యలో సర్వేలు అప్పగించడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, కొందరు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని మొత్తుకుంటున్నారు. ఇదే అంశాన్ని జిల్లాల వారీగా అధికారులకు మొరపెట్టుకున్నారు. పదుల సంఖ్యలో ఉన్న తమ డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. కొన్ని డిమాండ్లకు అయినా పరిష్కారం చూపుతారని ఆశపడ్డారు. అయితే ఏ ఒక్క డిమాండ్‌ను పరిష్కరించకపోగ...అధనపు పనిభారాన్ని మోపడంతో గత్యంతరం లేక న్యాయపోరాటానికి దిగారు. చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు సిద్ధమైంది.

వేధింపులు మొదలయ్యాయి!

చలో విజయవాడకు వెళ్లిన స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నిరసనలో పాల్గొన్న ఉద్యోగి పేరు, ఊరుతోపాటు వారి సతీమణి, తల్లిదండ్రులు, పిల్లల పేర్లు తెలుసుకోవడమే కాకుండా వాళ్ల వృత్తి తదితర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తగత సమాచారాన్ని ఇవ్వడానికి ఉద్యోగులు ఇష్టపడడం లేదు. అయినప్పటికీ పోలీసులు పదేపదే అడుగుతుండడంతో పలువురు ఉద్యోగులకు తప్పడం లేదు. ఈ క్రమంలో వారంతా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. చలో విజయవాడ నిరసన ఫలితంగానే ఇదంతా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. వేధింపులు మానకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

రెండున్నరేళ్లుగా అభ్యర్థిస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నాం. అధికారులకు వినతి పత్రాలు సమర్పించాం. నాయకుల

కాళ్లావేళ్లా పడ్డాం. కానీ ఏ ఒక్కరూ కనికరించలేదు. మేము కూడా భార్యాబిడ్డలు, కుటుంబాన్ని పోషించాలి. ఇలా.. ఎన్నాళ్లు ఓర్చుకోవాలి.

అందుకే చలో విజయవాడకు పిలుపునిచ్చాం. నిరసన వ్యక్తం చేసినందుకు మాపై కూటమి ప్రభుత్వం కక్ష పెంచుకుంది. అత్యంత గోప్యంగా

ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని పోలీసుల ద్వారా సేకరిస్తోంది. సమస్యలు పరిష్కరించకుండా ఇలా భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఇలాగే చేస్తే ఉద్యమం మరింత తీవ్రతరమవుతుంది...’ అంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement