నేటి నుంచి ప్రత్యేక ఉత్సవం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రత్యేక ఉత్సవం ప్రారంభం

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

● డీఆర్వో మోహన్‌ కుమార్‌ ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ● నాణ్యత పరిశీలనలో 9,20,404 ఫొటోల ఆమోదం

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో గురువారం నుంచి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయని ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం స్వామికి అభిషేకం ఉంటుందన్నారు. రాత్రికి స్వామి అధికార నంది వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారని పేర్కొన్నారు. ఇందుకు కాణిపాకం పళ్లువర్‌ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారని తెలిపారు.

జీతాలు ఇవ్వాలని

డీఈఓకు వినతి

చిత్తూరు కలెక్టరేట్‌: హై స్కూల్‌ ప్లస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు కోరారు. వారు బుధవారం డీఈఓ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎంటీఎస్‌ ఉపాధ్యాయులకు పెండింగ్‌ జీతాలు మంజూరు, మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణకు జూన్‌ నుంచి బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రతి నెలా జరుగుతున్న సీఆర్సీ సమావేశాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు హాజరుకాలేకపోతున్నారని, పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చలపతిరావు, గిరిబాబు, నాయకులు చంగల్రాయమందడి, దేవానంద్‌, ధనుంజయలు పాల్గొన్నారు.

చురుగ్గా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు డీఆర్వో మోహన్‌ కుమార్‌ తెలిపారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఈ నెల 22వ తేదీ నాటికి మొత్తం 1,34,307 నోటీసులు జారీ చేసి విచారణ పూర్తి చేశామన్నారు. 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు జిల్లాలో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో మొత్తం 2,22,096 ఫారాలు నమోదైనట్లు చెప్పారు. వీటిలో పరిశీలన అనంతరం 2,10,466 ఫారాలు రోల్‌ అప్‌డేట్‌కు ఆమోదం పొందాయన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు (ఫారమ్‌–6)లో 31,931 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 24,684 దరఖాస్తులు ఆమోదం పొందినట్టు పేర్కొన్నారు. 3,055 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

పకడ్బందీగా ఫొటో నాణ్యత పరిశీలన

జిల్లా వ్యాప్తంగా ఫొటో నాణ్యత పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఆర్వో వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 12,04,067 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 10,52,741 ఫొటోలు అప్‌లోడ్‌ అయ్యాయన్నారు. బీఎల్వోల పరిశీలనలో 9,20,404 ఎస్‌ఐఆర్‌ ఫొటోలు ఆమోదం పొందాయన్నారు. బీఎల్వోల వద్ద పెండింగ్‌ లేవని, ఈఆర్‌వో, ఏఈఆర్‌ఓ స్థాయిలో 2.14 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా, అర్హులందరికీ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం క్షేత్రస్థాయి పరిశీలనలో తమ సూచనలు అందించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నుంచి విజయసింహారెడ్డి, ఉదయ్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి బాలసుబ్రహ్మణ్యం, బీఎస్పీ నుంచి సురేంద్రబాబు, బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, సీపీఐ నుంచి వాడ గంగరాజు పాల్గొన్నారు.

ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్‌ మణికొండకు చెందిన కొండూరు రాజేశ్వరి, సుబ్రమణ్యం దంపతులు రూ.10 లక్షల విరాళం అందజేశారు. సోమవారం టీటీడీ చైర్మన్‌న్‌ బీఆర్‌ నాయుడిని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాత దంపతులకు చైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement