ఎమ్మెల్యే పీఏ సర్వీస్‌ రూల్స్‌ ధిక్కరణ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పీఏ సర్వీస్‌ రూల్స్‌ ధిక్కరణ

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

● డీఆర్వోకు వైఎస్సార్‌సీపీ నాయకుడు కిషోర్‌యాదవ్‌

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ అధికారిక పీఏ కుమారస్వామి సర్వీస్‌ రూల్స్‌ ధిక్కరించారంటూ వైఎస్సార్‌ సీపీ 12వ డివిజన్‌ అధ్యక్షుడు కిషోర్‌యాదవ్‌ ఆరోపించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్వో మోహన్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే పీఏగా వ్యవహరిస్తూ, ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న పల్లెబోయిన కుమారస్వామి యాదవ్‌ ఈ నెల 22న నిర్వహించిన విలేకరుల సమావేశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్‌ నిర్వహించడమే కాకుండా, సర్వీస్‌ రూల్స్‌ను బేఖాతరు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరు మండలం నాయనిచెరువులో క్వారీ నిర్వహణకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు కుమారస్వామి ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి కలెక్టర్‌ అనుమతి లేకుండా విలేకరుల సమావేశం పెట్టడం సర్వీస్‌ రూల్స్‌కు వ్యతిరేకం. టీడీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిష్పాక్షిక విచారణ జరపాలి

ఎమ్మెల్యే పీఏ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ వీడియో పుటేజ్‌, పేపర్‌ క్లిప్పింగ్‌లను పరిశీలించి, ఆయన నియామక వివరాలు, సర్వీస్‌ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర నిష్పాక్షిక విచారణ జరిపించాలని కిషోర్‌ యాదవ్‌ డీఆర్వోను కోరారు. ప్రాథమిక విచారణ ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement