ముగిసిన వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

కాణిపాకం: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉదయం ఆలయ పుష్కరిణిలో త్రిశూలానికి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానం చేయించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలలోని తీర్థాలను పుష్కరిణిలో కలిపి త్రిశూలానికి పవిత్ర స్నానం చేయించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

కనుల పండువగా వసంతోత్సవం

త్రిశూల స్నానం అనంతరం వసంతోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రంగు నీళ్లు చల్లుకుంటూ దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు ఉత్సాహంగా ఊరేగించారు. అనంతరం యాగశాలలోని పర్యవేక్షణ యాగమూర్తికి ముగింపు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు చేశారు. మూషిక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా అవరోహణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement