● కూటమి ప్రభుత్వంలో తగ్గిపోయిన 102 సర్వీసులు ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గణనీయంగా తగ్గిన వాహనాలు ● అరకొర సేవలపై ఆస్పత్రుల వద్ద బాలింతల నిరీక్షణ ● తప్పని ప్రైవేటు వాహనాల బాదుడు ● కనుమరుగైన హైరిస్క్‌ గర్భిణుల రవాణా సదుపాయం ● పట్టించుకోని అధికార యంత్ర | - | Sakshi
Sakshi News home page

● కూటమి ప్రభుత్వంలో తగ్గిపోయిన 102 సర్వీసులు ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గణనీయంగా తగ్గిన వాహనాలు ● అరకొర సేవలపై ఆస్పత్రుల వద్ద బాలింతల నిరీక్షణ ● తప్పని ప్రైవేటు వాహనాల బాదుడు ● కనుమరుగైన హైరిస్క్‌ గర్భిణుల రవాణా సదుపాయం ● పట్టించుకోని అధికార యంత్ర

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

● కూటమి ప్రభుత్వంలో తగ్గిపోయిన 102 సర్వీసులు ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గణనీయంగా తగ్గిన వాహనాలు ● అరకొర సేవలపై ఆస్పత్రుల వద్ద బాలింతల నిరీక్షణ ● తప్పని ప్రైవేటు వాహనాల బాదుడు ● కనుమరుగైన హైరిస్క్‌ గర్భిణుల రవాణా సదుపాయం ● పట్టించుకోని అధికార యంత్రాంగం

కాణిపాకం: చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో 2 జిల్లా ఆస్పత్రులు, 98 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 22 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 9 ఏరియా ఆస్పత్రులు విస్తరించి ఉన్నప్పటికీ, వాటికి అనుసంధానంగా ఉండాల్సిన రవాణా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

చాలీచాలని వాహనాలు

ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులైన అనంతరం బాలింతలను సురక్షితంగా, ఉచితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు గత ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఉచితంగా ఇంటి వద్ద దింపి వచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఈ సేవలపై నిర్లక్ష్యం చూపుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో 16 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 11 ఉన్నాయి. రోజూ 25 నుంచి 30 మంది బాలింతలను మాత్రమే ఇళ్లకు చేరుస్తున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో గతంలో 19 వాహనాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్యను 16కు తగ్గించారు. అక్కడ రోజువారిగా 30 నుంచి 40 మంది తల్లులను మాత్రమే ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

హైరిస్క్‌ సేవలు ఏవీ?

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో హైరిస్క్‌ గర్భిణుల కోసం ప్రత్యేకంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను విస్తరించారు. ఒక కాల్‌ చేస్తే చాలు.. ఇంటి నుంచే వాహనాన్ని బుక్‌ చేసుకుని గర్భిణిని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం హైరిస్క్‌ రవాణా సేవల గురించి పట్టించుకోలేదు. పల్లె ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో నేటికీ సరైన బస్సు సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ గర్భిణులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆస్పత్రులకు రావాల్సి వస్తోంది. ఈ సేవలు అందించే విషయంలో స్థానిక ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ చేతులెత్తేస్తున్నారు. అధికారులు సైతం ఈ సేవలను పట్టించుకోవడం మానేయడంతో హైరిస్క్‌ గర్భిణుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు పేరుకే మిగిలిపోయాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వాహనాల సంఖ్యను పెంచి, పాత పద్ధతిలోనే రవాణా సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఉమ్మడి జిల్లాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

అరకొర సేవలే

జిల్లాల్లో తల్లీబిడ్డ వాహనాలు పరిమితంగా తిరుగుతుండటంతో అందరికీ ఉచిత రవాణా అంద డం లేదు. బాలింతలు ఉదయం డిశ్చార్జ్‌ అయి నా సాయంత్రం వరకు వాహనం రాదని సిబ్బంది తేల్చిచెబుతున్నారు. దీంతో బాలింతలు పసిపాపలతో ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షించా ల్సి వస్తోంది. ఒకేసారి ఇద్దరు, ముగ్గురు డిశ్చార్జ్‌ అయితే ఎవరిని తీసుకెళ్లాలో తెలియక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో వేచి ఉండలేక బాధితులు సొంత డబ్బులు వెచ్చించి ప్రైవేటు ఆటోలు, టాక్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement