చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరుకు చెందిన మూడు నెలల చిన్నారి బండి జియారెడ్డి పొడవైన సహజ జుట్టుతో యంగెస్ట్ బేబీ డాక్యుమెంటెడ్ విత్ ఎక్సెప్షనల్లీ లాంగ్ నేచురల్ హెయిర్ అట్ త్రీ మంత్స్ అనే టైటిల్‌కు సంబంధించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుదక్కించుకుంది. చిన్నారి తల్లిదండ్రులు బండి శివకుమార్, అలేఖ్యను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో చిన్నారి బండి జియారెడ్డిని ఆశీర్వదించడంతో పాటు, చిన్నారి తల్లిదండ్రులను సైతం అభినందించారు.


