గుడిసె దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గుడిసె దగ్ధం

Sep 16 2026 3:37 AM | Updated on Sep 16 2026 3:37 AM

శ్రీరంగరాజపురం : మండలంలోని తుంగమిట్ట గ్రామంలో సోమ వారం సాయంత్రం జి.ఆర్ముగం అనే వ్యక్తి పూరిల్లు దగ్ధమైంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌కారణంగా ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపాడు. పిల్లల సర్టిఫికెట్లు రూ.2లక్షల నగదు, 90 పీవీసీ పైపులు, ఇంటి పట్టా, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిబూడిదైనట్లు వెల్లడించాడు. ప్రభు త్వం ఆదుకోవాలని కోరాడు.

బొలేరో బోల్తా : ముగ్గురికి గాయాలు

కుప్పంరూరల్‌ : బొలేరో వాహనం బోల్తాపడి ముగ్గురు గాయపడిన ఘటన కుప్పం మండలం, మల్లమ్మ చెరువు వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. బేటరాయస్వామి కొండ వైపు నుంచి కుప్పం దిశగా వస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పడంలో ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో రాహుల్‌ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కుప్పంరూరల్‌ : కుప్పం పట్టణం సమీపంలోని వాణిమహల్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మార్కెట్‌ యార్డు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కుప్పం వైపు నుంచి వెళుతున్న కారు ఢీ కొంది. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు.

బాల్‌ బ్యాడ్మింటన్‌లో

జిల్లా జట్టు విజేత

నగరి : ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించిన అంతర్‌ జిల్లాల సబ్‌ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో చిత్తూ రు జిల్లా జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సాధించింది. ఈ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న నగరికి చెందిన దువ్వూరు లక్ష్మీనరసింహారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ జాతీయ సబ్‌ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌న్‌ జట్టుకు లక్ష్మీనరసింహారెడ్డిని ఎంపిక చేసింది. దీనిపై క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్‌ పోటీల్లో 3వ సారి జిల్లా జట్టు విజయం సాధించి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement