పెద్దపంజాణి : తల్లిని కోల్పోయిన బాధ ఒక వైపు.. ఆమె కళ్లే తన జీవి తానికి వెలుగవుతాయనే ఆశ మరో వైపు.. క్షణాల్లో జరిగిన ప్రమాదంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. అయితే చూపులేని ఆ ఇంటి పెద్దకొడుకు జీవితంలో వెలు గు నింపాలనే ఆలోచనతో తల్లి కళ్లను దానం చేయాలని కుటుంబం నిర్ణయించింది. ఒక ప్రమా దం తల్లి ప్రాణాలు తీసుకెళ్లింది. కానీ, కుటుంబం తీసుకున్న నిర్ణయం మాత్రం ఆమెను మరొకరి జీవితంలో వెలుగుగా నిలబెడుతోంది.
విషాదంగా మారిన ప్రయాణం
మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లావారిపల్లెకు చెందిన రాజమ్మ(55) తన చిన్న కుమారుడు గోపితో కలసి సొంత పనుల నిమి త్తం మంగళవారం ఉదయం సచివాలయానికి బైక్‌పై బయలు దేరింది. పనులు ముగించుకున్న అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో ఆమె ధరించిన చీర బైక్ ఫోర్క్‌లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి కింద పడడంతో రాజమ్మ తలకు తీవ్రమైన గాయ మైంది. వెంటనే స్థానికుల సహాయంతో చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజమ్మ మృతి చెందింది.
చూడలేని పెద్ద కుమారుడు రామకృష్ణ
రాజమ్మకు ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు రామకృష్ణకు కంటి చూపులేదు. చిన్న నాటి నుంచి తమకు అండగా నిలిచిన తల్లి ఇకలేదనే విషయం ఆకుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా పెద్దకుమారుడి పరిస్థితి అందరినీ మరింత బాధకు గురిచేసింది. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే కుటుంబసభ్యులు రాజమ్మ కళ్లను రామకృష్ణకు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యులను సంప్రదించి, శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


